Sandeep Kishan Sigma release date Announcement
సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కొడుకు సంజయ్ జాసన్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 31న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో సందీప్ కిషన్ మాస్ లుక్‌లో కనిపిస్తూ చేతిలో భారీ వెపన్ పట్టకుని స్టైలిష్‌గా నిల్చోన్న తీరు ఆకట్టుకుంది.
Sandeep Kishan Sigma release date Announcement
ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఈ టీజర్లో ‘మంచోడు మహానుభావుడు.. చెడ్డోడు రాక్షసుడు.. చూసే నీ చూపును బట్టి, ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారతాను..’ అని సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. యాక్షన్, ఇంటెన్సిటీ, ఎనర్జిటిక్‌గా సందీప్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. ఒక ట్రెజర్ హంట్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా, రాజు సుందరం, అన్బు థాసన్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో కేథరీన్ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో బైలింగ్విల్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు.
Sandeep Kishan Sigma release date Announcement