EPIC – FIRST SEMESTER Priyasakhi Song
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌తోపాటు, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, మంగళవారం సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రియ సఖి’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను హేషమ్ అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేయగా, సురేష్ బనిశెట్టి ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. కేఎస్ హరిశంకర్ పాడిన తీరు ఇంప్రెస్ చేస్తోంది. ‘‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి.. చంద్రుడు చూడని కొత్త వెన్నెల ఇది.. భూమికి తెలియని మట్టి వాసన ఇది..ఏమిది.. కవులే రాయని కొత్త కావ్యమిది.. మునులే చెయ్యని కొత్త ధ్యానమిది.. దేవతలు ఎరుగని దివ్యలోకమిది.. ఏమిది..ఏమిది..జీవితాన్ని మార్చేశావే బుజ్జి నెమలి.. స్వర్గం లోతు చూపించావే పూల కడలి.. చిన్న పిల్లనైపోయానే స్పర్శ తగిలి.. ఉండలేనే.. నిన్ను వదిలి.. ప్రియసఖి.. ”అంటూ సాగిన పాటలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
EPIC – FIRST SEMESTER Priyasakhi Song
ఈ పాట తన భావోద్వేగ లోతు, హాయినిచ్చే అనుభూతితో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. ప్రేమ అనే భావన చుట్టూ అల్లుకున్న ఈ పాట, ఒక యువకుడు తనకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మనసులో దాచుకున్న మౌన భావాలను, ఆరాధనను, అనురాగాన్ని అందంగా ఆవిష్కరించింది. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సరికొత్తగా, ప్రశాంతంగా, భావోద్వేగభరితంగా ఉండే ఒక బాణీని సృష్టించి మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ పాటలో వాద్య సంగీతం మృదువుగా సాగుతూ, గాత్రాన్ని మించిపోకుండా భావాన్ని మరింత మెరుగుపరిచింది. ఈ పాట ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తూనే, తెలియని భావోద్వేగాన్ని మిగులుస్తుంది. అందుకే ఈ గీతం ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. లండన్ నేపథ్యంతో చిత్రీకరించిన ‘ప్రియసఖి’ పాట దృశ్యపరంగా అద్భుతంగా ఉంది. ఆ సుందరమైన దృశ్యాలు పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ‘బేబీ’ సూపర్ హిట్ తర్వాత ఆనంద్, వైష్ణవి జంట నటిస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ జోడీపై అంచనాలు ఏర్పడ్డాయి. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.