Peddi Bengaluru Press Meet
తనకు నచ్చిన పని, తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నానని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం మేమంతా ఎంతో నిజాయితీగా, ప్రాణం పెట్టి పనిచేశాం. రాసిపెట్టుకోండి… ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. శివన్న నాకు ఒక ఫాదర్, ఒక అంకుల్, ఒక బ్రదర్‌లాంటి వారు. ఆయన భారతీయ సినీ పరిశ్రమలో ఒక లెజెండ్, కన్నడ చిత్రసీమకు చక్రవర్తి. అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఏఆర్ రెహమాన్ గారు ఈ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. జాన్వీ కూడా ఈ సినిమా కోసం ఎంతో నిజాయితీగా పనిచేశారు. మా నిర్మాత సతీష్ గారికి ఇది తొలి చిత్రం. ఆయన హార్ట్ ఫుల్ గా చేశారు. బుచ్చిబాబు లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే జగపతిబాబు గారికి, డీవోపీ రత్నవేలు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా జరగడానికి ప్రధాన కారణమైన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా జీవితంలో నేను చేసిన మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిలిం ‘పెద్ది’. జూన్ 4న మీరందరూ తప్పకుండా థియేటర్లలో ఈ సినిమాను చూస్తారని కోరుకుంటున్నా. నాకు కన్నడ రాదు.. ఈసారి వచ్చినప్పుడు కచ్చితంగా కన్నడలో మాట్లాడతాను”అని చెప్పారు.
Peddi Bengaluru Press Meet
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ‘‘రామ్ చరణ్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ వచ్చారు. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ గారికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను. మన మధ్య భాషా భేదాలు లేవు. మంచి కళాకారులను మనం ఎప్పుడూ ప్రేమతో ఆదరిస్తాం. ఈ సినిమాలో ఒక పాత్ర ఉందని చెప్పగానే నేను వెంటనే చేస్తానని చరణ్ గారికి చెప్పాను. బుచ్చిబాబు గారు నా పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మా ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బలమైన భావోద్వేగం ఉంది. ‘పెద్ది’ పాత్ర ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోతుంది”అని అన్నారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా ప్రత్యేకమైన కథ. రామ్ చరణ్ గారితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన కన్నడ సూపర్ స్టార్ శివన్న గారితో ఒక సీన్లో నటించే అవకాశం రావడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను”అని చెప్పింది.
Peddi Bengaluru Press Meet
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ‘‘ ‘పెద్ది’లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా. కుటుంబ సమేతంగా చూసే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఆయన అంకితభావం, శ్రమ స్క్రీన్‌పై ప్రతి క్షణంలో కనిపిస్తుంది. మేమంతా ఎంతో ప్రేమతో ఈ సినిమాను రూపొందించాం. జూన్ 4న మీరందరూ థియేటర్లలో ‘పెద్ది’ని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా”అని అన్నారు.