Ramcharan, Sruthihasan Hellallallo Video Song :
‘‘కానుకలుంటాయి, బంకులుంటాయి, బంగారాలుంటాయి.. బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలు ఉంటూంటాయి.. మనిషన్నవొడికి ఇవి మామూలే.. ప్రతి పూట తప్పని పేచీలే.. అడపదడపా ఇడిచేయ్ గడప.. వారానికి వెయ్యి.. నాకోసం రాయి.. నెలకొసారైనా నీకిత్తా ఈ హాయి.. అందం విందులు ఉన్నాయి..దాదా ఆలోచిస్తాపోతే ఆలస్యమైపోదా.. హల్లల్లో హల్లల్లో.. బావ సీరా సొక్కా సిక్కడిపోవాలో.. హల్లల్లో హల్లల్లో.. బావ సిగ్గు, ఎగ్గు మొగ్గైపోవాలో…” అంటూ రామ్ చరణ్, శృతి హాసన్ మధ్య సాగిన ఈ పాట మాస్‌ను ఊర్రూతలూగిస్తుంది. ‘పెద్ది’ చిత్రంలో ఈ స్పెషల్ సాంగ్‌ను ఆదివారం విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ మాసివ్ ట్యూన్‌కు అనంతశ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా, రక్షిత సురేష్ ఎనర్జిటిక్‌గా పాడిన తీరు మరింత హైప్ తీసుకొచ్చింది. రామ్ చరణ్, శృతి హాసన్‌తోపాటు జాన్వీ కపూర్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రామ్ చరణ్, శృతి హాసన్ జోడీ ‘ఎవడు’ చిత్రం తర్వాత దాదాపు పన్నెండేళ్ల తర్వాత మరోసారి సిల్వర్ స్ర్కీన్‌పై మెరుస్తుండటంతో ఈ పాటపై అంచనాలు పెరిగాయి.
Ramcharan, Sruthihasan Hellallallo Video Song :
బుచ్చిబాబు సానా రూపొందించిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. చికిరి చికిరి, రైరై రారా పాటలు మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోగా ఇప్పుడొచ్చిన మూడో స్పెషల్ సాంగ్ కూడా అదే రీతిలో ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చేలా కనిపిస్తోంది. అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. జూన్ 3 నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.