Dulquer Salmaan 41 wraps up a Key schedule
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో రవి నేలకుదిటి దర్శకత్వం వహిస్తున్న మూవీ ఒకటి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ హీరోగా నటిస్తున్న 41 చిత్రమిది.
తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన కీలక షెడ్యూల్ విజయవంతంగా పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. “DQ41 wraps up a schedule where key sequences were shot” అంటూ చేసిన పోస్టు ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్టు వెల్లడించారు.


Dulquer Salmaan 41 wraps up a Key schedule
ఇక ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుందని కూడా మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో దుల్కర్ అభిమానులు అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతిబాబు, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అనయ్ ఓం గోస్వామి, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్‌గా కొల్లా అవినాష్ వర్క్ చేస్తున్నారు. లవ్ స్టొరీతో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు తదుపరి షూటింగ్ షెడ్యూల్‌పై మరిన్ని అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.