Vihari OTT App Launching in November
ట్రావెల్, ఫుడ్, టూరిజం విశేషాలను ప్రేక్షకులకు అందిస్తూ సుదీర్ఘకాలంగా అలరిస్తున్న ‘విహారి – ద ట్రావెలర్’ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. 2004లో మా టీవీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు సరికొత్త ఓటీటీ యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. నవంబర్‌లో యాప్‌ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు.
Vihari OTT App Launching in November
ఏఎల్ నితిన్ వ్యవస్థాపకుడిగా, దర్శకుడిగా ముందుకు తీసుకొస్తున్న ‘విహారి’.. ప్రయాణాలకు సంబంధించిన సమాచారం, పర్యాటక ప్రాంతాల విశేషాలు, ఫుడ్ స్పెషాలిటీస్, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రయాణ ప్రణాళికలు వంటి అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. గతంలో కరుణ, పీజీ వింద, స్నిగ్ధ వంటి యాంకర్లతో ఎన్నో ఆసక్తికరమైన, సమాచారభరితమైన ఎపిసోడ్స్‌ను అందించిన విహారి.. ఇప్పుడు సరికొత్త ఫార్మాట్లో డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. లెజెండరీ యాంకర్ సుమతోనూ నవంబర్ నుంచి వినూత్నమైన ఎపిసోడ్స్‌ను ప్రసారం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కొత్త ప్రయాణంలో యాంకర్ శ్రీ సత్య ‘విహారి’ ఓటీటీకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సదరన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రవీణ్, వజ్ర కన్స్ట్రక్షన్స్కు చెందిన రాజు, శ్వేత, యాంకర్ శ్రీ సత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీటీఎఫ్, వేగా జ్యువెలర్స్ కూడా ఈ ఓటీటీ ప్రాజెక్ట్‌తో భాగస్వాములయ్యాయి.
ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్ మాట్లాడుతూ.. 2004 నుంచి ఏఎల్ నితిన్‌తో తనకు పరిచయం ఉందని, ఆయన వివరించిన విహారి కాన్సెప్ట్ అప్పట్లోనే ఎంతో నచ్చిందని తెలిపారు. నితిన్ ఎంచుకున్న మార్గం ఇప్పుడు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా విహారిని ఆదరించడం ఆనందంగా ఉందని, ఎంతో సమాచారాన్ని అందించే ఈ కార్యక్రమం ఓటీటీ రూపంలోనూ విజయవంతమవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
వజ్ర కన్స్ట్రక్షన్స్ రాజు మాట్లాడుతూ.. విహారి గురించి తెలుసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్‌తో భాగస్వామ్యం కావాలనే ఆసక్తి కలిగిందని చెప్పారు. నితిన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆలోచించే వ్యక్తి అని, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
వజ్ర కన్స్ట్రక్షన్స్ శ్వేత మాట్లాడుతూ.. చిన్నతనంలోనే విహారి ట్రావెల్ ఎపిసోడ్స్ చూసి ప్రయాణాలపై ఆసక్తి పెంచుకున్నానని గుర్తుచేసుకున్నారు. తాను ప్రయాణాలు ప్రారంభించకముందే విహారి ద్వారా ఎన్నో ప్రదేశాల గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు అదే కార్యక్రమం ఓటీటీ రూపంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
విహారి అధినేత ఏఎల్ నితిన్ మాట్లాడుతూ.. 2004లో మా టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కరుణ, పీజీ వింద, స్నిగ్ధ అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఓటీటీకి హోస్ట్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు శ్రీ సత్య గుర్తుకు వచ్చారని, ఆమె ఎంతో అంకితభావంతో పనిచేస్తారని అన్నారు. తన ప్రయాణంలో మొదటి నుంచి మద్దతుగా నిలిచిన టీటీఎఫ్ మహేష్, సదరన్ ట్రావెల్స్ ప్రవీణ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వజ్ర కన్స్ట్రక్షన్స్ రాజు, శ్వేత, వేగా జ్యువెలర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

యాంకర్ శ్రీ సత్య మాట్లాడుతూ.. ఇప్పటివరకు హోస్ట్‌గా పనిచేయని తాను, మొదటిసారి ఈ బాధ్యతను స్వీకరించేటప్పుడు కొంత భయపడ్డానని చెప్పారు. అయితే ఏఎల్ నితిన్ ఇచ్చిన ప్రోత్సాహం, సహకారం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాయని తెలిపారు. తక్కువ బడ్జెట్లో ఎక్కడ బస చేయాలి, మంచి ఆహారం ఎక్కడ లభిస్తుంది, ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చు వంటి ప్రయాణికులకు అవసరమైన ఎన్నో విషయాలను విహారి అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని, తనను ఎంపిక చేసిన నితిన్‌కు, సహకరిస్తున్న స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు.
18 ఏళ్లుగా టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న ‘విహారి – ద ట్రావెలర్’.. ఇప్పుడు ఓటీటీ వేదికగా మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సిద్ధమైంది. కొత్త తరహా కార్యక్రమాలు, ప్రముఖ యాంకర్లతో ప్రత్యేక ఎపిసోడ్స్‌తో నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ యాప్‌పై ఆసక్తి నెలకొంది.