కులాల ప్రస్తావనతో రంగరాజన్‌

కులాల నేపథ్యంలో సాగే సినిమాలు సమాజంలో ఉన్న వివక్షను, ఆధిపత్య ధోరణులను, కుల మతాల మధ్య ఘర్షణలను తెరపై కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. తాజాగా ఈ బ్యాక్‌డ్రాప్‌లోనే CASTE అనే మరో ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ ద్వారా మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రం నుంచి తాజాగా వచ్చిన అప్‌డేట్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. నటుడు నాగబాబు కొణిదెల Konidela Nagababu పాత్రను రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఎకె జంపన్న రచించి దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం, కులవ్యవస్థ వంటి సున్నితమైన అంశాన్ని స్పృశిస్తూ ఒక బలమైన కథను చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబును ‘రంగరాజన్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నల్ల దుస్తుల్లో, మెడలో రుద్రాక్షమాల, నుదుటిపై తిలకం ధరించి ఇంటెన్స్‌గా కనిపిస్తున్న ఆయన లుక్ పాత్ర గంభీరతను, అథారిటీని స్పష్టంగా తెలియజేస్తోంది. ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో పాటు, భయపడని స్వభావం, సమాజంలో కులాలకు అతీతంగా మానవత్వాన్ని ప్రతిబింబించే వ్యక్తిగా రంగరాజన్ పాత్ర ఉండబోతుందని చిత్ర యూనిట్ సంకేతాలు ఇస్తోంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కషిక కపూర్, దివి వదత్య నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో వరుణ్ సందేశ్, సత్యం రాజేష్​ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కథకు అనుగుణంగా భావోద్వేగాలను బలపరచేలా ఆయన స్వరాలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించడంతో, ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతోంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని