న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం మొదలు

నిర్మాత బెల్లంకొండ సురేష్  చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. స్వాతిముత్యం, నేను స్టూడెంట్ సర్ సినిమాల తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. ‘తొలి ప్రేమ’, ‘హ్యాపీ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్’ వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాపులరైన దర్శకుడు ఎ. కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనికా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తొలి క్లాప్ ఇవ్వగా, అనుదీప్ కెవీ స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్చాన్ చేశారు. న్యూ-ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ డైలాగ్ రైటర్‌‌గా వర్క్ చేస్తున్నారు. వరుస మ్యూజికల్ హిట్స్ అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ముగ్గురు డిఫరెంట్ క్రియేటివ్ మైండ్స్ కలయిక ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. కరుణాకరన్ తనదైన శైలిలో సాఫ్ట్, ఎమోషనల్ లవ్ స్టోరీని అందిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కెవీ తన యూనిక్ హ్యూమర్, షార్ఫ్ స్టైల్ డైలాగ్స్‌తో కథకు న్యూ కలర్ తెస్తున్నారు. ఆయన డైలాగ్ రైటర్‌గా పనిచేయడం ఫన్ ఫ్రెష్ నెస్ మరింత పెరగనుంది. స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఎనర్జిటిక్, చార్ట్‌బస్టర్ పాటలతో పేరు తెచ్చుకున్న ఆయన సంగీతం ఈ చిత్రానికి యూత్‌ఫుల్ వైబ్‌ను తీసుకురానుంది. లవ్. ఎంటర్టైమెంట్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయన మ్యూజిక్ ఉండబోతోంది. కరుణాకరన్, అనుదీప్, భీమ్స్.. ఈ ముగ్గురు కలయిక ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తోంది. ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేక శైలిని జోడించి ఒక ఫుల్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా, నటీనటులు, సాంకేతిక బృందం గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. బెల్లంకొండ గణేష్‌ మూడేళ్ల గ్యాప్ తర్వాత, కరుణాకరన్ దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత  మెగాఫోన్ పడుతున్న ఈ చిత్రం విజయం ఇద్దరికీ చాలా ముఖ్యమని చెప్పాలి.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని