విజయ్ దేవరకొండ ప్రస్తుతం విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్గా ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో వైరా బ్యానర్పై ఓ చిత్రాన్ని అనౌన్స్ చేయగా, సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ కొట్టి చిత్ర యూనిట్కు బెస్ట్ విషెస్ చెప్పారు. నాని క్లాప్తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో మంచి హైప్ నెలకొంది. గ్లోబల్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, విజయ్ దేవరకొండ, శౌర్యువ్ కాంబినేషన్కు నాని సపోర్ట్ లభించడంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి.
మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బ్రిటీషర్ల అకృత్యాలపై పోరాడే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న పాన్ ఇండియావైడ్గా సినిమా విడుదల కానుంది. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్థన’ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.





