ఈసారి కష్టమో నష్టమో నేనే భరిస్తా

టాలీవుడ్‌లో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే హీరో రామ్ పోతినేని Ram Pothineni ఇప్పుడు మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను అలరించిన రామ్, ఇరవై ఏళ్ల తన కెరీర్‌‌లో ఈసారి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, రామ్ తనే హీరోగా నటిస్తూ, తనే దర్శకత్వం వహిస్తూ, తన సొంత బ్యానర్‌లో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడట. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అతని విజన్‌తో ముందుకు వెళ్లనుందని టాక్. కథ, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్ అన్నీ కొత్తగా ఉండేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక విభిన్నమైన స్టోరీలైన్‌ను ఫైనల్ చేశారట. సైఫై యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్‌కి కూడా పెద్దపీట వేస్తూ ఈ మూవీ ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా రామ్ తనలోని క్రియేటివ్ సైడ్‌ను బయటపెట్టడానికి ఈ ప్రాజెక్ట్ మంచి వేదిక అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. తన సొంత బ్యానర్‌పై నిర్మాణం చేయడం ద్వారా కథపై పూర్తి నియంత్రణ ఉండేలా చూసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో టెక్నికల్ టీమ్ ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

గత నాలుగేళ్లుగా ది వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్రాక్రింగ్ తాలుకా చిత్రాలతో వరుస పరాజయాలు ఎదుర్కొని.. ఆశించిన స్థాయిలో ఈ చిత్రాలు ఆడకపోవడంతో ఈసారి కష్టమో నష్టమో తానే భరిస్తానన్నట్టుగా అత్యంత ప్రెస్ట్రీజియస్‌ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని రూపొందించేలా రామ్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టార్ హీరోలు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న ఈ ట్రెండ్‌లో, రామ్ కూడా తన ప్రతిభను మరో కోణంలో చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

మరోవైపు రామ్ త్వరలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌‌లో నటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో అంచనాలు పెట్టుకున్న గత చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో తన కొత్త సినిమా ఎంపిక విషయంలో రామ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువ దర్శకుడి స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేసిన ఓ వర్థమాన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. ఇటీవల రామ్‌ను కలిసి స్టోరీ కూడా వినిపించినట్టు టాక్. యాక్షన్‌ కంటెంట్‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్‌కు రామ్ ఓకే చెప్పినట్టుగా సమాచారం. తన కెరీర్‌‌లోనే హ్యూజ్ బడ్జెట్‌తో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌‌ ఉండబోతోందట. చివరదశ చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ గురించి త్వరలో అనౌన్స్‌మెంట్‌ రానుంది. మరి ఈ ప్రాజెక్టుల్లో ఏది ముందు పట్టాలెక్కనుందో చూడాలి.

Related Posts

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు…

‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని