Dulquer Salmaan Credits Nag Ashwin for His Telugu Journey
తనదైన నటనతో తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ముఖ్యంగా మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలు ఆయన్ను టాలీవుడ్‌కు మరింత చేరువ చేశాయి. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన మలయాళ చిత్రం ‘ఐయామ్ గేమ్’. ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ ‘RDX’ ఫేం నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Dulquer Salmaan Credits Nag Ashwin for His Telugu Journey
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ దుల్కర్ నిర్మాతగా ‘లోక’ సినిమా వేడుకకు వచ్చాను. ఆ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఐయామ్ గేమ్’ సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఆయన నిర్మించడమే కాదు, నటించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా నేను కొంత చూశాను. ఇందులోని కాన్సెప్ట్‌కు మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది. దుల్కర్ గారు మంచి సినిమాలను ఇష్టపడతారు. ‘మహానటి’ నుంచి ఆయనతో నాకు జర్నీ ఉంది. ఆయన కథకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చే నటుడు. ఆయన కథ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘ఇది నా ప్రొడక్షన్లో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్. నేను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ఇది తెలుగులో తీసిన ఒక పెద్ద సినిమాలాగే ఉంది అని చెప్పారు. ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు హీరోలను ఆదరించడంలో చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు.. ఇలా ఎవరి పేరు చెప్పినా ప్రేక్షకులు కేరింతలు కొడతారు. అది తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం. మీ అందరి మనసులో నాకు కూడా చోటు కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాతో కూడా అలరిస్తానని నమ్ముతున్నాను. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పాను. నాగి ఈ సినిమా చూశారు. ఆయన ఎడిటింగ్‌లో హెల్ప్ కూడా చేశారు. తెలుగులో ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘మహానటి’ నా ఫేవరెట్. అది నాకు పాత్ బ్రేకింగ్ సినిమా. నా తెలుగు కెరీర్‌కు క్రెడిట్ మొత్తం నాగి, స్వప్న, ప్రియాంకకే ఇస్తాను. ఈరోజు నా సినిమాను ప్రమోట్ చేస్తున్నానంటే దానికి కారణం నాగి, స్వప్న, ప్రియాంక. వైజయంతి సినిమా అంటే నాకు ఫ్యామిలీ. నాగి ఎప్పుడు కాల్ చేసినా తన సినిమాలో చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను’ అని చెప్పారు.
ఐయామ్ గేమ్ చిత్రంలో నటించిన ఆంటోనీ వర్గీస్, నిర్మాత సందీప్ గుణ్ణం, కదిర్, సంయుక్త విశ్వనాథన్ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.