Nani Produce Nithiin’s ‘Alias Rukmini’
అప్పుడు అసిస్టెంట్‌గా.. ఇప్పుడు నిర్మాతగా
నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’
హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని.. నిర్మాతగానూ తనదైన ముద్ర వేస్తున్నారు. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇప్పటికే ‘కోర్ట్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘దండోరా’ చిత్రంతో గుర్తింపు పొందిన మురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాని అక్క దీప్తి గంటా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Nani Produce Nithiin’s ‘Alias Rukmini’
సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. అలాగే ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను, ‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా వీడియోను రూపొందించడంతో సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

హీరోగా కాకముందు దర్శకుడు కె.రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో, నితిన్ హీరోగా 2005లో తెరకెక్కిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రానికి నాని ముహూర్తపు క్లాప్ కొట్టారు. ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా క్లాప్ కొట్టిన నాని.. ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు స్టార్ హీరోగా, విజయవంతమైన నిర్మాతగా మారి నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ చిత్ర ప్రారంభోత్సవంలో మళ్లీ క్లాప్ కొట్టడం విశేషంగా మారింది.
https://x.com/Pinkvillat24/status/2084189177332334940?s=20
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన నాని, నితిన్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “నేను హీరో కాకముందు నుంచే నితిన్ నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన నటించిన ‘జయం’, ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, ఈ సినిమాను కూడా అదే స్థాయిలో ప్రేమిస్తారని నమ్ముతున్నాను. ఇది ఒక అందమైన ప్రేమకథ. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే చిత్రాన్ని రూపొందించబోతున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది” అని తెలిపారు.
హీరో నితిన్ మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చెప్పారు. “ఈ సినిమా నాతో పాటు మొత్తం చిత్ర బృందం గర్వపడేలా ఉంటుంది. ఎంతో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం” అని ఆయన అన్నారు.
దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ మాట్లాడుతూ, వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ, అద్భుతమైన స్క్రిప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘కృష్ణ’ పాత్రకు నితిన్ పూర్తిగా సరిపోతారని తెలిపారు. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ‘అలియాస్ రుక్మిణీ’పై టైటిల్ ప్రకటనతోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.