Raviteja Irumudi From ‘Yalalo Yalalo’ Song
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న కుటుంబ భావోద్వేగాల చిత్రం ‘ఇరుముడి’ ప్రమోషన్స్ వేగంగా కొనసాగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ‘ఇరుముడి కట్టు’ అనే భక్తి గీతంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన చిత్రబృందం, తాజాగా రెండో పాట ‘యాలాలో యాలాలో’ను విడుదల చేసింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీని హెషామ్ అబ్దుల్ వహాబ్, సాధికా కె.ఆర్. ఎంతో హార్ట్ఫుల్గా పాడారు.
Raviteja Irumudi From ‘Yalalo Yalalo’ Song
“అమ్మతో దాపరికం.. నాన్నతో రాచరికం.. మా ఇంటి ప్రేమరికం.. మాతోనే మాలోకం.. యాలాలో ఏముంది మేడల్లో యాలో.. ఏముంది కాసుల్లో యాలో.. ప్రేముంది గుండెల్లో…” అంటూ అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం మధ్యతరగతి కుటుంబాల్లో ప్రేమ, అనుబంధాలే నిజమైన సంపద అనే భావాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది.
పాటలో కుటుంబ బంధాలు, చిన్న చిన్న ఆనందాలు, ఆప్యాయతలను సహజంగా చూపించిన విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాఫ్ట్ మెలోడీతో పాటు భావోద్వేగభరితమైన సాహిత్యం ఈ పాటను మరింత గుర్తుండిపోయేలా చేసింది. కుటుంబ అనుబంధాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న ‘ఇరుముడి’ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.