Karthi New Film With Mohan Raja
తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలు, కమర్షియల్ హీరోయిజాన్ని సమపాళ్లలో మేళవించిన భారీ ఎంటర్టైనర్గా రూపొందనుంది.
Karthi New Film With Mohan Raja
ఈ సినిమాతో కార్తీ, మోహన్ రాజా తొలిసారి కలిసి పనిచేయనుండటం విశేషం. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూనే కమర్షియల్ అంశాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా, ఈసారి కార్తీని మరో కొత్త, పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని చిత్రబృందం తెలిపింది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న మోహన్ రాజా, ఈ చిత్రంతో మళ్లీ మెగా ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్లో కార్తీకి ఇది వరుసగా నాలుగో సినిమా. గతంలో ‘దేవ్’, ‘సర్దార్’, ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న ‘సర్దార్ 2’ తర్వాత మరోసారి ఇదే నిర్మాణ సంస్థతో ఆయన చేతులు కలపడం విశేషంగా మారింది. ముఖ్యంగా ‘సర్దార్ 2’ విడుదలకు ముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం కార్తీ, ప్రిన్స్ పిక్చర్స్ మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని చాటుతోంది.
ప్రస్తుతం కేవలం అనౌన్స్మెంట్తోనే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. నటీనటులు, సాంకేతిక బృందం, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ తేదీ తదితర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.