Alia Bhatt Sharvari action entertainer – Alpha
యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం చెప్పేలా, ఇద్దరు స్టార్ హీరోయిన్లను అత్యంత డెడ్లీ అవతారాల్లో చూపిస్తూ యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆల్ఫా’. బుధవారం ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలియా భట్, శర్వారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించగా, జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌తో భారీ అంచనాలు పెంచిన మేకర్స్.. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
Alia Bhatt Sharvari action entertainer – Alpha
ట్రైలర్ ప్రారంభం నుంచే స్టైలిష్ విజువల్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇందులో ఆలియా భట్‌ను అత్యంత ప్రమాదకరమైన యోధురాలిగా తీర్చిదిద్దే మెంటర్ పాత్రలో బాబీ డియోల్ క్రూరమైన లుక్‌లో కనిపిస్తారు. హంతకురాలిగా మారిన ఆలియా.. కొన్ని అనూహ్య పరిస్థితుల కారణంగా తనకే శిక్షణ ఇచ్చిన గురువుపై ఆయుధం ఎత్తాల్సి వస్తుంది. అసలు బాబీ డియోల్, ఆలియా భట్‌లకు ‘ఆల్ఫా’ ప్రోగ్రామ్‌తో ఉన్న బంధం ఏమిటి? ఎందుకు ఇద్దరూ శత్రువులుగా మారారు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలను ట్రైలర్ లేవనెత్తింది.
ఇక అనిల్ కపూర్ మరో కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తూ కథలో కీలక మలుపులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శర్వారి పాత్రను పూర్తిగా రివీల్ చేయకపోయినా.. ఆలియాకు అండగా నిలిచి బాబీ డియోల్‌ను ఎదుర్కొనే ధైర్యవంతురాలిగా ఆమె కనిపించింది. ఇద్దరు హీరోయిన్లు కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయనే సంకేతాలు ట్రైలర్ ఇస్తోంది.
ట్రైలర్‌లోని స్టైలిష్ ఫ్రేమ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాను విజువల్ ఫీస్ట్‌గా నిలబెట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ టాప్ డీజే హ్యూగెల్ వరల్డ్‌వైడ్ చార్ట్‌బస్టర్ ట్రాక్ ‘జమైకన్ బామ్ బామ్’ ను బ్యాక్‌గ్రౌండ్‌లో వినియోగించడం ట్రైలర్‌కు మరింత ఎనర్జీని జోడించింది. థియేటర్లలో ఈ యాక్షన్ అనుభూతి ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతుందనే భావన కలిగిస్తోంది.
మొత్తంగా చూస్తే, ‘ఆల్ఫా’ ట్రైలర్ కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. స్టైల్, థ్రిల్, ఎమోషన్, సస్పెన్స్‌ల మేళవింపుగా నిలిచింది. ఆలియా భట్ కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ యాక్షన్ అవతారాన్ని ఆవిష్కరిస్తూ, శర్వారితో కలిసి ఈ జూలై 3న బాక్సాఫీస్‌పై భారీ దాడికి సిద్ధమవుతోందని తెలుస్తోంది.