Comrade Kalyan first single on June 20
విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు మరోసారి పూర్తి స్థాయి ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తుండగా, కోన వెంకట్ సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచగా… ఇప్పుడు ఆ హైప్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ‘ఒరియా పిల్లా’ పేరుతో రూపొందిన ఫస్ట్ సింగిల్‌ను జూన్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Comrade Kalyan first single on June 20
ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోస్టర్లో శ్రీ విష్ణు, హీరోయిన్ మహిమా నంబియార్ మధ్య కనిపించిన ఫ్రెష్ కెమిస్ట్రీ, అందమైన రొమాంటిక్ వైబ్ ప్రేక్షకుల్లో పాటపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ‘ఒరియా పిల్లా’ అనే టైటిల్ కూడా కొత్తదనాన్ని సూచిస్తూ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.
వినోదం, ప్రేమ, యాక్షన్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్‌గా కూడా బలమైన టీమ్ ఈ చిత్రానికి పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సాయి శ్రీరామ్ అందిస్తుండగా, సంగీతాన్ని విజయ్ బుల్గానిన్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఛోటా కె. ప్రసాద్ నిర్వహిస్తున్నారు.