Heart-Touching Glimpse of Raviteja Irumudi
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా భిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ బుధవారం విడుదలైంది.
Heart-Touching Glimpse of Raviteja Irumudi
ఇది కేవలం మాస్ సినిమా మాత్రమే కాదని, హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ స్టోరీ అని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇందులో రవితేజ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్‌గా కనిపిస్తున్నారు. ఆయన తన కూతురుతో సరదాగా గడుపుతూ ఉన్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్‌ను చూపించడం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. అంతలోనే రవితేజ.. విలన్స్‌ను ఊచకోతు కోస్తూ తనదైన మాస్ అవతార్‌లో శివమెత్తారు. విలన్ తలపై కూర్చొని తల నరకే సీన్ మాస్ ఆడియెన్స్‌కు విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. రవితేజ దగ్గుతుండగా.. ‘మందు మానేయ్ నాన్న’ అని చిన్నారి చెప్పడంతో రవితేజ అయ్యప్ప దీక్ష తీసుకున్నట్టు ఈ వీడియో ద్వారా చూపించారు. ఆ తర్వాత ఆయన అయ్యప్ప భక్తుడిగా మారి పూర్తిగా మారిపోతారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ మాలలో ఉన్న ఆయన లుక్ డివైన్ ఫీల్‌ను కలగజేస్తుంది. పచ్చని పరిసరాల మధ్య ఉన్న విజువల్స్, మాస్ ఫీల్‌తో ఉన్న యాక్షన్ సీన్స్, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇవన్నీ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక్క డైలాగ్ లేకుండానే భావోద్వేగాలను వ్యక్తం చేయగలిగేలా ఈ వీడియోను రూపొందించడం హైలైట్.
Heart-Touching Glimpse of Raviteja Irumudi
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్‌తోపాటు ఈ గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. భక్తి, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను మిక్స్ చేస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది . ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. ఆమె “కావేరి” అనే పాత్రలో కనిపించనుంది. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుండగా, ఇప్పటికే మేజర్ పార్ట్ షూట్ పూర్తయింది. ఆగస్టులో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.