Chennai Love Story Vadalane Song :
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ‘కలర్ ఫొటో’, ‘బేబి’ చిత్రాల తర్వాత సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి. సాయి రాజేష్ ఈ చిత్రానికి కథను అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘వదలనే’ అంటూ సాగే ఈ పాటను ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ మాధవపెద్ది సురేష్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, హరి గౌర, మార్క్ కె రాబిన్, సింజిత్ యెర్రమల్లి, చేతన్ భరద్వాజ్, స్వీకర్ అగస్తీ, సురేష్ బొబ్బిలి, వివేక్ సాగర్, శ్రీచరణ్ పాకాల, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ‘‘బేబి’ సినిమా చూసిన తర్వాత సాయి రాజేశ్ ఫ్యాన్స్ లో నేనూ ఒకరిగా మారిపోయాను. ఈ సినిమా సాంగ్స్, విజువల్స్ చూస్తుంటే బేబి సినిమా స్టాండర్డ్ లోనే ఉంటుందని, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని అర్థమవుతోంది. నా ఫ్రెండ్ మణిశర్మ చేసిన ‘వదలనే..’ పాట హాంటింగ్ గా ఉంది. ఈ పాటను మ్యూజిక్ లవర్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ వదలనే అనాలి. అంత పెద్ద విజయం సాధించాలి. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉంటాయి. ఒక లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే ఇంక చెప్పక్కర్లేదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే సంగీతం. మ్యూజిక్ ఈ సినిమాకు చక్కగా కుదిరింది. హీరో హీరోయిన్స్ కూడా ఫ్రెష్ పెయిర్‌గా కనిపిస్తున్నారు. హీరో హీరోయిన్స్ ఎక్స్ ప్రెషన్స్, విజువల్స్ బాగున్నాయి. ఈ వేదిక మీద ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకులు సింజిత్ యెర్రమల్లి, హరి గౌర, మాధవపెద్ది సురేష్, మార్క్ కె రాబిన్, స్వీకర్ అగస్తీ, శ్రీచరణ్ పాకాల, వివేక్ సాగర్, చేతన్ భరద్వాజ్, సురేష్ బొబ్బిలి, అనూప్ రూబెన్స్, కల్యాణి మాలిక్ ఈ సినిమా పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కావాలని కోరారు.
Chennai Love Story Vadalane Song
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం అందరిలాగా నేను కూడా ఎదురుచూస్తున్నా. త్వరగా రిలీజ్ చేయమని మా ప్రొడ్యూసర్స్‌ను అడుగుతున్నా. ఈ సినిమా ఎలాంటి విజయం అందించబోతుందో మాకు తెలుసు. వదలనే పాట గురించి చెప్పాలంటే..ఈ పాట పిక్చరైజేషన్ పాండిచ్చేరిలో చేశాం. ఒక బ్యూటిఫుల్ టెంపుల్ దగ్గర డైరెక్టర్ రవి నాకు, గౌరికి సీన్ చెప్పారు. ఆ సీన్ చెబుతున్నప్పుడు నాకు, రవికి, గౌరికి కళ్లు చెమర్చాయి. అంత ఎమోషనల్ అయ్యాం. ఈ పాటలో ఫస్ట్ వచ్చిన ఆ సీన్ విజువల్ తెలుగు సినిమాల్లో ఒక ఐకానిక్ సీన్ గా మిగిలిపోతుంది. మణిగారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సినిమా చూసి బయటకు వచ్చాక ఈ పాట హాంట్ చేస్తూనే ఉంటుంది. వదలనే సాంగ్ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్ కలుగుతోంది. ఈ పాటను మీరంతా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా” అని అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ -‘‘ నేను సింగర్ కావాలని ప్రయత్నించాను. ఏ కాంపిటేషన్ కు వెళ్లినా మణిశర్మ గారి పాటలు పాడాను. అలా ఆయన నన్ను కొత్త సింగర్‌గా ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించడం గౌరవంగా భావిస్తున్నా. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న చిత్రంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్ రాజేశ్ గారు, ఎస్ కేఎన్ గారికి, హీరో కిరణ్ గారికి, డైరెక్టర్ రవి గారికి థ్యాంక్స్. ఒక మ్యూజిక్ లవర్ గా ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వేదిక షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పింది.
ఈ చిత్రం బెస్ట్ మ్యూజికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని చిత్ర దర్శకుడు రవి నంబూరి అన్నారు.
ప్రొడ్యూసర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ ‘‘మణిశర్మ గారి కోసం ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మా ఈవెంట్ కు వచ్చారు. మణిశర్మ గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనను కలిసినప్పుడు ఈ సినిమాలో అన్ని పాటలు మెలొడీస్ కావాలని చెప్పాను. ఆయన నుంచి మెలొడీ సాంగ్స్ మిస్ అవుతున్నాం. అందుకే చెన్నై లవ్ స్టోరీ సినిమాలోని ఏడు పాటలు మెలొడీస్ కావాలని అడిగాను. అలా మేము ఆయనను రిక్వెస్ట్ చేసి చేయించుకున్న చిత్రమిది. వదలనే పాట ఇంత బాగుందంటే క్రెడిట్ మణిగారితో పాటు అనంత శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ రవికి ఇవ్వాలి. హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ వస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక గొప్ప పాటగా నిలిచిపోతుంది. కిరణ్ గారు ఈ పాటలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు”అని చెప్పారు.
ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ అవుతుందని, వంద కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని అన్నారు.